తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబర్​పేట నియోజకవర్గంపై మంత్రుల సమీక్ష - పురపాలకశాఖ మంత్రి కేటీఆర్

జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల వారి సమీక్షా సమావేశాలను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంబర్​పేట నియోజకవర్గ అభివృద్ధిపై అసెంబ్లీలోని సమావేశ మందిరంలో చర్చించారు.

మంత్రుల సమీక్ష

By

Published : Sep 18, 2019, 9:48 PM IST

Updated : Sep 18, 2019, 11:44 PM IST

జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో రోజూ.. దాదాపు 11 మిలియన్​ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేయాలని మంత్రులు కేటీఆర్, తలసాని జలమండలి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రేటర్​ పరిధిలోని నియోజకవర్గాల వారి సమీక్షా సమావేశాలను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ..

నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఈ భేటీలో చర్చించారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, అంబర్​పేట ఫ్లైఓవర్ పనుల వివరాలను అధికారులు అందించారు. అంబర్​పేట ఫ్లై ఓవర్ పనుల ప్రారంభానికి అవసరమయిన భూసేకరణ దాదాపుగా పూర్తైంయిదని టౌన్ ప్లానింగ్ అధికారులు మంత్రులకు తెలియజేశారు. ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్ ​కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'రేషన్ డీలర్లకు కమీషన్ పెంచే అంశం పరిశీలనలో ఉంది'

Last Updated : Sep 18, 2019, 11:44 PM IST

ABOUT THE AUTHOR

...view details