రైతుబంధు నగదును వీలైనంత త్వరగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని.. ఆ దిశగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖల మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుబంధు సాయం పంపిణీపై ఆర్థిక, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ఇరువురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. నిధుల సమీకరణ, రైతుఖాతాల వివరాలు, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
'రైతుబంధు సాయాన్ని త్వరగా అందించాలి' - finance minister harishrao
రైతుబంధు సాయాన్ని వీలైనంత త్వరగా రైతుల ఖాతాల్లో జమచేయాలని మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డిలు అధికారులను ఆదేశించారు. నిధుల సమీకరణ, రైతు ఖాతాల వివరాలు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
'రైతుబంధు సాయాన్ని త్వరగా అందించాలి'
పాసు పుస్తకాలు, ఖాతాలు, భూ రికార్డుల ఆధునీకరణ సంబంధిత అంశాల వివరాలను మంత్రులు తెలుసుకున్నారు. వర్షాకాలం పంటల పనులు ప్రారంభమయ్యేలోపే రైతుబంధు సాయాన్ని రైతులకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని.. అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా.. జాప్యం కాకుండా రైతుల ఖాతాల్లో నగదు జమచేయాలని తెలిపారు. వచ్చే వారం, 10 రోజుల్లో ప్రక్రియను ప్రారంభించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.