తెలంగాణ

telangana

ETV Bharat / state

'టౌన్ షిప్ ప్లాట్ల అమ్మకానికి విధి విధానాలు ఖరారు చేయండి' - మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి తాజా వార్తలు

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా నిర్మించిన బండ్లగూడ, పోచారం టౌన్ షిప్ ప్లాట్ల అమ్మకానికి విధి విధానాలు ఖరారు చేయాలని రోడ్డు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహాల అమ్మకం విలువ ఇంకొంత మెరుగు పరిచి, బహిరంగ మార్కెట్‌లో అర్థవంతమైన ధర పలికే విధంగా అంచనా విలువలు సరి చేయాలని సూచించారు.

'టౌన్ షిప్ ప్లాట్ల అమ్మకానికి విధి విధానాలు ఖరారు చేయండి'
'టౌన్ షిప్ ప్లాట్ల అమ్మకానికి విధి విధానాలు ఖరారు చేయండి'

By

Published : Jul 24, 2020, 11:07 PM IST

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా నిర్మించిన హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారం టౌన్ షిప్ ప్లాట్ల అమ్మకానికి విధి విధానాలు ఖరారు చేయాలని రాష్ట్ర రోడ్డు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. మంత్రుల నివాస సముదాయంలోని అధికారిక నివాసంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు, వాల్యుయర్స్ సంస్థ నైట్ ఫ్రాంక్ ప్రతినిధులతో మంత్రి సమీక్షించారు.

సమావేశంలో బండ్లగూడ టౌన్ షిప్‌లో 2,246 ప్లాట్లు, పోచారం టౌన్ షిప్‌లో 1,470 ప్లాట్లు.. మొత్తంగా సుమారు 3,716 ప్లాట్లను ప్రస్తుతం ఉన్నవి ఉన్నట్లుగా అమ్మడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషనకు ఎంత మేర ఆదాయం సమకూరే అవకాశం ఉందో లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. గృహాల అమ్మకం విలువ ఇంకొంత మెరుగు పరిచి, బహిరంగ మార్కెట్‌లో అర్థవంతమైన ధర పలికే విధంగా అంచనా విలువలు సరి చేయాలని అధికారులకు, వాల్యుయర్స్ సంస్థకు మంత్రి సూచించారు.

ఇవీ చూడండి:కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details