తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన : మంత్రి ఉత్తమ్‌కుమార్‌

Minister Uttam Kumar Reddy Praja Palana Karimnagar : తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త పథకాలతో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలనకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్​కుమార్ పేర్కొన్నారు. ఈక్రమంలోనే రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.

Minister Uttam on Issue of Ration Cards
Minister Uttam Kumar Reddy on Prajapalana Applications

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2023, 4:42 PM IST

Updated : Dec 27, 2023, 8:06 PM IST

ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన : మంత్రి ఉత్తమ్‌కుమార్‌

Minister Uttam Kumar Reddy Praja Palana Karimnagar :ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేయాలన్న లక్ష్యంతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పౌరసరఫరాల శాఖ(Civil Supplies Department) మంత్రి ఉత్తమ్​కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా డిసెంబర్ 28 వ తేదీ నుంచి జనవరి 06వ తేదీ వరకు అభయహస్తం పేరిట దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.

Minister Uttam Kumar Reddy on Praja Palana Applications :ఇందులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రజాపాలనపై అధికారులకు చేపట్టిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు(Congress Six guarantees) అమలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రజాపాలన చేపడుతున్నట్లు వివరించారు. కొత్త రేషన్ కార్డులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మరో కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం - ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన'

Minister Uttam On Ration Rice Recycling :ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పని చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ సూచించారు. ప్రజలకు 24 గంటలు అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రతి విషయంలో పారదర్శకంగా ఉండాలని, అవినీతికి తావులేకుండా పథకాల అమలు(Schemes Implementation) జరగాలని ఆదేశించారు. ఇటీవల తాను పలు రేషన్ షాపులను తనిఖీ చేసినట్లు వెల్లడించిన మంత్రి, రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ జరుగుతున్న విషయాన్ని గమనించానని చెప్పారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎత్తిపోతల పథకాలపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మేడిగడ్డ పరిశీలనకు ఈ నెల 29న వెళ్తున్నట్లు మంత్రి ఉత్తమ్ ​కుమార్ తెలిపారు.

'నేటి ప్రభుత్వం ఈ ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకుపోయి, ఒక చరిత్రాత్మక ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ గ్యారెంటీలన్నింటినీ వంద రోజుల వ్యవధిలో అమలుచేయబోతున్నాము. ఈ కార్యక్రమాల అమలు కోసం, భవిష్యత్​లో చేయబోయే అభివృద్ది పనులకుగానూ సమాచారమనేది కచ్చితత్వంతో ఉండటంలో ఇది ఎంతో దోహదపడుతుంది. అధికారులు, ఎవరి స్థాయిలో వారు చొరవ తీసుకుని కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపేలా, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలి.'-ఉత్తమ్​కుమార్, పౌరసరఫరాల మంత్రి

CM Revanth Reddy Released Prajapalana Application Form : రాష్ట్ర శాససనభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 పథకాలకు గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ మేరకు సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీఎస్‌ శాంతికుమారితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.

అభయహస్తం 6 గ్యారంటీల లోగో, పోస్టర్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మహాలక్ష్మి(Mahalakshmi Scheme), రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు గురువారం నుంచి జనవరి ఆరో తేదీ వరకూ గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. గ్రామసభల ద్వారా అర్హులైన వారి వివరాలు సేకరించి, వారికి లబ్ధిచేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.

త్వరలోనే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

రేపటి నుంచే ఐదు పథకాలకు దరఖాస్తు స్వీకరణ - రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ : సీఎం రేవంత్

Last Updated : Dec 27, 2023, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details