తెలంగాణ

telangana

ETV Bharat / state

పామాయిల్ సాగులో ప్రభుత్వ సంకల్పానికి అధికారులు చొరవ చూపాలి : తుమ్మల

Minister Thummala review on Horticutural Crops : రైతాంగానికి దన్నుగా ఉండేలా వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ కార్యదర్శి కార్యాలయంలో ఇరుశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పామాయిల్ పంటసాగు, విస్తీర్ణం పెంచేలా టీఎస్ ఆయిల్‌ఫెడ్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Minister Thummala meeting on Palmoil Crop
Minister Thummala review on Horticutural Crops

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 7:10 PM IST

Minister Thummala review on Horticutural Crops :వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanthreddy) ప్రత్యేక దృష్టి సారిస్తున్న దృష్ట్యా సాగు రంగంలో అనేక సంస్కరణలు చేపట్టేలా ప్రభుత్వం సంకల్పంతో ఉందని వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు పూర్తి సమాచారంతో ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శి సత్యశారద, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి, ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ మొత్తం అప్పులు రూ.56వేల కోట్లు : ఉత్తమ్‌

రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచాలని చర్యలు తీసుకుంటున్న దృష్ట్యా ప్రభుత్వ లక్ష్యం చేరుకునేలా అధికారులు చొరవ చూపాలని మంత్రి తుమ్మల(Minister Thummala) సూచించారు. ప్రతి జిల్లాలో పామాయిల్ పంట, సాగు, విస్తీర్ణం పెంచేలా టీఎస్ ఆయిల్‌ఫెడ్(TS Oilfed) చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉద్యాన శాఖకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

Minister Thummala meeting on Palmoil Crop :రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. త్వరలో వ్యవసాయ పరిధిలోని అన్ని రాష్ట్ర సంస్థల ఉన్నతాధికారులతో సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అన్ని అంశాలపై విస్తృతంగా చర్చిద్ధామని చెప్పారు.

ప్రజా దర్బార్ ఇకపై ప్రజావాణి - టైమింగ్స్ ఇవే

వ్యవసాయరంగ అభివృద్ధి పనుల కోసం స్థానికంగా నీటిపారుదల, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల సేవలు వినియోగించుకోవాలని ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో మొత్తం 197 వ్యవసాయ మార్కెట్ యార్డుల స్థితిగతులు, పనితీరు, ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర వివరాలు అందించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మార్కెటింగ్ వ్యవస్థలో సమస్యలు, క్రయ, విక్రయాలు, ధరలు తదితర అంశాలపై పూర్తి వివరాలు సమర్పించాలన్నారు. ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటల ఉత్పత్తులు అమ్ముకునే మార్కెట్ యార్డులు దన్నుగా ఉండేలా తీర్దిదిద్దాలని స్పష్టం చేశారు. మార్కెట్ యార్డుల్లో సమస్యల్ని ఎప్పటికప్పుడు మార్కెటింగ్ అధికారులు పర్యవేక్షించాలని ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

వర్షాలు, ఇతర ఇబ్బందులతో రైతులకు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో గొప్పగా పనితీరు కనబరుస్తున్న మార్కెట్లను ఆదర్శంగా తీసుకుని ఒకటి రెండు మార్కెట్ యార్డులను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెటింగ్ శాఖలో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు. అలాంటి వారి వివరాలు ఎప్పటికప్పుడు అందించేలా ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. అన్నదాత సాగుకు దన్నుగా ఉండేలా వ్యవసాయ శాఖ పనితీరు మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

టీఎస్​పీఎస్సీపై సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష - పదో తరగతి, ఇంటర్​ పరీక్షలపై కూడా

ABOUT THE AUTHOR

...view details