తెలంగాణ

telangana

ETV Bharat / state

అర్చకుడి మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది: మంత్రి తలసాని - పూజారి మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి

పద్మారావునగర్​లోని శ్రీ పంచముఖ ఆంజనేయ దేవాలయ అర్చకుడు వెంకటేశ్వర శర్మ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందిని మంత్రి తలసాని అన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

minister thalasani srinivas yadav pay tributes to padmaraonagar hanuman temple priest
అర్చకుడి మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది: మంత్రి తలసాని

By

Published : Feb 20, 2021, 5:26 PM IST


గత నెలలో సూరత్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన అర్చకుడి కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. పద్మారావునగర్​లోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయ అర్చకులు శ్రీ వెంకటేశ్వర శర్మ సూరత్​కు వెళ్లారు. అప్పుడు రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వెంకటేశ్వర శర్మ చికిత్స పొందుతూ... శుక్రవారం రాత్రి మరమించాడు. సమాచారం తెలుసుకున్న మంత్రి తలసాని... వెంకటేశ్వర శర్మ నివాసానికి వెళ్లి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకటేశ్వర శర్మ మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​ కృషితో దేవాలయాల అభివృద్ధి: ఇంద్రకరణ్ రెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details