తెలంగాణ

telangana

ETV Bharat / state

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం: తలసాని

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం తీసుకొస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ ప్రకటించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

Minister thalasani srinivas yadav on cine industry
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం: తలసాని

By

Published : May 5, 2020, 11:47 AM IST

Updated : May 5, 2020, 3:04 PM IST

లాక్‌డౌన్ వల్ల సినీ పరిశ్రమకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ అన్నారు. సినీరంగంపై ఆధారపడి లక్షలమంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా కరోనాను తరిమికొట్టి యథావిధిగా కార్యకలాపాలు సాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్లు తలసాని వివరించారు.

లాక్‌డౌన్ తర్వాత సినీపరిశ్రమ పెద్దలతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. థియేటర్లపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం: తలసాని

ఇవీ చూడండి:కాంగ్రెస్ నేతల 'రైతు సంక్షేమ దీక్ష' ప్రారంభం

Last Updated : May 5, 2020, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details