తెలంగాణ

telangana

ETV Bharat / state

వరద విధ్వంసంపై మోదీ స్పందించకపోవడం బాధాకరం: తలసాని

సికింద్రాబాద్‌ పరిధిలోని మోండామార్కెట్‌, రాంగోపాల్‌పేట్‌, బేగంపేట్‌ డివిజన్లలో అధికారులతో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పర్యటించారు. వరద బాధితులకు రూ. 10 వేల ప్రభుత్వ సాయాన్ని అందజేశారు.

'ఇంతవరకు ప్రధాని స్పందించకపోవడం బాధకరం'
'ఇంతవరకు ప్రధాని స్పందించకపోవడం బాధకరం'

By

Published : Oct 21, 2020, 5:37 PM IST

హైదరాబాద్‌లో వరద విధ్వంసం జరిగి వారం గడుస్తున్నా... కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదని... పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆరోపించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మానవతా దృక్పథంతో సాయం చేస్తుంటే... ప్రధాని మోదీ ఇంత వరకూ సీఎం లేఖపై స్పందించకపోవడం బాధాకరమన్నారు.

సికింద్రాబాద్‌ పరిధిలోని మోండామార్కెట్‌, రాంగోపాల్‌పేట్‌, బేగంపేట్‌ డివిజన్లలో అధికారులతో కలిసి పర్యటించిన మంత్రి... వరద బాధితులకు రూ. 10వేల ప్రభుత్వ సాయాన్ని అందజేశారు. ప్రజలకు ఏ ఇబ్బందులొచ్చినా ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: హెచ్చరిక.. రాగల 24 గంటలు అప్రమత్తత అవసరం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details