కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇరు రాష్ట్రాలకు రూ.20 కోట్ల ఆర్థిక సహాయం చేసిన రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మెన్ రామోజీరావుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని ఆదర్శ నగర్లో రేషన్ కార్డులు లేని పలువురు పేదలకు నిత్యావసర వస్తువులను మంత్రి పంపిణీ చేశారు.
రామోజీరావుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తలసాని - updated news on Minister Talasani thanked Ramoji rao
కరోనా కట్టడి కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.20 కోట్ల ఆర్థిక సహాయం అందించిన రామోజీరావుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
రామోజీరావుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తలసాని
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. చాలా మంది దాతలు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులు సైతం తమ వంతు సాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ.. ప్రజలంతా సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి:షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం