హైదరాబాద్ బాలానగర్‌లోని నర్సాపూర్ చౌరాస్తాలో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సాపూర్ చౌరస్తా నిత్యం రద్దీగా ఉంటుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య పరిష్కారం కోసమే... ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. నవంబరు నాటికి పూర్తి చేసి... అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
'నవంబరు నాటికి నర్సాపూర్ చౌరస్తా పై వంతెన రెడీ' - minsiter talsani srinivas yadav about narsapur chowrasta fly over
నవంబరు నాటికల్లా నర్సాపూర్ చౌరస్తాలో నిర్మిస్తున్న పై వంతెనను అందుబాటులోకి తెస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బాలానగర్‌లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి... అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
'నవంబరు నాటికి నర్సాపూర్ చౌరస్తా ఫ్లై ఓవర్ రెడీ'
ఫ్లై ఓవర్ నిర్మాణానికి స్థల సేకరణ సమయంలో కొందరు కోర్టును ఆశ్రయించటం... కరోనా ఆంక్షల నేపథ్యంలో కార్మికుల కొరత ఏర్పడటం వల్ల నిర్మాణం కాస్త నెమ్మదిగా కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు.
TAGGED:
ఫ్లై ఓవర్ పనులు