హరితహారం కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడానికి పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా పాటుపడాలని మంత్రి తలసాని కోరారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్క్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి శాసనసభ్యులు ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ సర్కిల్ ఉప కమిషనర్ ఉమా ప్రకాష్ మొక్కలు నాటారు.
'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి' - harithaharam programme
పెరుగుతున్న కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో శాసనసభ్యులు ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ సర్కిల్ ఉప కమిషనర్ ఉమా ప్రకాష్‌తో కలిసి మంత్రి తలసాని మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటి వాటిని బాధ్యతగా పరిరక్షించాలి: మంత్రి తలసాని
పెరుగుతున్న కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి పరిరక్షణకు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర నాయకులు ఎంఎన్ శ్రీనివాస రావు, యువ నాయకులు ముఠా జై సింహ, ఎం.ప్రభాకర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: జిల్లాలో ఒక్క రోజే 1.15 లక్షల మొక్కలు నాటాం: కేటీఆర్