అభివృద్ధి కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాంగోపాల్ పేట డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికైన చీర సుచిత్ర... వెస్ట్ మారేడ్‌పల్లిలోని మంత్రి నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సుచిత్రను మంత్రి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తా: తలసాని
రాంగోపాల్‌పేట డివిజన్ అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి తలసానిని రాంగోపాల్‌పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర మర్యాదపూర్వకంగా కలిశారు.
అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తా: తలసాని
ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, అనంతరం అభివృద్ధి, ప్రజాసంక్షేమం పైనే దృష్టి సారించాలని తలసాని అన్నారు. రాంగోపాల్‌పేట డివిజన్ అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని, సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ సుచిత్రకు మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: న్యాయవాదుల హత్య.. తెరాస చేసిన హత్యే: డీకే అరుణ