తెలంగాణ

telangana

ETV Bharat / state

తెల్ల రేషన్​ కార్డులేని వారి జాబితా సిద్ధం చేయాలి: తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తాజా వార్తలు

హైదరాబాద్​ మాసబ్​ ట్యాంక్​ వద్ద ఉన్న పశుసంవర్ధక శాఖ సంచాలకుల కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తెల్ల రేషన్​ కార్డు లేని కుటుంబాలకు జాబితాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలు, 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ, 1500 రూపాయల నగదు పంపిణీ, వలస కార్మికుల సమస్యలు, ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

తెల్ల రేషన్​ కార్డులేని వారి జాబితా సిద్ధం చేయాలి: తలసాని
తెల్ల రేషన్​ కార్డులేని వారి జాబితా సిద్ధం చేయాలి: తలసాని

By

Published : Apr 24, 2020, 7:36 PM IST

రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు లేని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల జాబితాలు సిద్ధం చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పశుసంవర్ధక శాఖ సంచాలకుల కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలు, 12 కిలోల ఉచిత బియ్యం, 1500 రూపాయల నగదు పంపిణీ, వలస కార్మికుల సమస్యలు, ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించారు. 12 కిలోల ఉచిత బియ్యం, 1500 రూపాయల నగదు పంపిణీ చేయాల్సిన వలస కూలీల వివరాలతో సమగ్ర సమాచారం వెంటనే సేకరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జంట నగరాల పరిధిలో ఆహార పంపిణీ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే చేపట్టాలని తెలిపారు. రోడ్లపై ఉన్న యాచకులను సమీపంలోని షెల్టర్లకు తరలించే క్రమంలో ఫంక్షన్ హాళ్లు, ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించారు. షెల్టర్లకు తరలించిన వారికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

లాక్ డౌన్ ఆంక్షల కారణంగా ట్రాపిక్ రద్దీ లేనందున నూతన రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని... ప్రజాప్రతినిధులు ఆ పనుల తీరును పరిశీలించాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ సూచించారు.

ఇదీ చూడండి:సీఎంఆర్​ఎఫ్​కు పెళ్లి ఖర్చులు.. వరుడికి కేటీఆర్ ప్రశంసలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details