గ్రేటర్ పరిధిలో 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం 197 బస్తీ దవాఖానలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఈనెల 14న మరో 26 దవాఖానలను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. నూతనంగా ప్రారంభించబోయే దవాఖానల ఏర్పాట్లపై మసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు.
'గ్రేటర్ పరిధిలో 300 బస్తీ దవాఖానాల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యం'
హైదరాబాద్ నగరంలో ఈ నెల 14న మరో 26 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బస్తీ దవాఖానాల ప్రారంభ ఏర్పాట్లపై మసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.
'గ్రేటర్ పరిధిలో 300 బస్తీ దవాఖానాల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యం'
పేదలకు వైద్యసేవలు చేరువ చేసేందుకే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. నూతన ఆస్పత్రులను మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, మహమూద్ అలీ ప్రారంభిస్తారన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, మూడు జిల్లాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కుంగుతున్న కాలువలు... వృథాగా పోతున్న నీరు