తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్ల ప్రస్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదిత్య కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో... హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని ధూల్‌పేట్, చుడిబజార్, కట్టెలమండితో పాటు పలు ప్రాంతాల్లో 2వేల మంది నిరుపేదలకు నిత్యావసర సరకులతో పాటు మాస్కులను మంత్రి తలసాని, ట్రస్ట్ ఛైర్మన్ నందకిషోర్ బిలాల్‌లు పంపిణీ చేశారు.
ఆదిత్యకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి తలసాని సరకుల పంపిణీ - goshamahal constituency
హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆదిత్యకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తెరాస 20 ఏళ్ల ప్రస్థానంలో సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన, అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెరాస పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకుందని అన్నారు. రాష్ట్రం సాధించిన 6 సంవత్సరాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో.. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. లాక్ డౌన్ సమయంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 21వేల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడంపై ట్రస్ట్ ఛైర్మన్‌ను మంత్రి అభినందించారు.
ఇవీ చూడండి: క్యాన్సర్‌తో పాటు కరోనాను జయించిన నాలుగేళ్ల శివాని