తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి తలసాని - కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి తలసాని

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ... దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్​పల్లిలోని ఆయన నివాసంలో... సనత్​నగర్ డివిజన్​కు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి తలసాని
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి తలసాని

By

Published : Aug 28, 2020, 7:59 PM IST

పేదలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. సనత్​నగర్​ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ పథకం కింద 8మందికి, షాదీముబారక్​ పథకం కింద 40 మందికి చెక్కులు పంపిణీ చేశారు. వారితో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రాంగోపాల్​ డివిజన్​కు చెందిన 11 మందికి ఆరు లక్షల విలువైన చెక్కులు అందించారు.

పేద ప్రజలతో పాటు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆసరా పింఛన్లు అందిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి, అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details