తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​, భాజపాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: తలసాని - corona virus

ప్రతిపక్షాలు కనీస ఆలోచన లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ మండిపడ్డారు. కాంగ్రెస్​, భాజపాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు.

minister talasani srinivas yadav comments on congress, bjp
కాంగ్రెస్​, భాజపాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: తలసాని

By

Published : May 7, 2020, 4:57 PM IST

రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎప్పుడు ఏం మాట్లాడాలో కనీస ఆలోచన, అవగాహన లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పనిచేస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేశ సరిహద్దులో పనిచేశానని చెబుతున్నారని... అయితే ఏంటని మంత్రి ప్రశ్నించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్‌, భాజపాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వలస కార్మికుల తరలింపును కేంద్రం చూసుకోవాల్సి ఉన్నప్పటికీ... అందుకు అవుతున్న ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్టు మంత్రి తలసాని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details