తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపాకు ఓటు వేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే: తలసాని - గ్రేటర్​ ఎన్నికలు

భాజపాకు ఓటు వేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ఆరోపించారు. భాజపా నాయకులు విద్వేషాలు రెచ్చగొట్టకుండా... భాగ్యనగర అభివృద్ధి కోసం ఏమి చేస్తారో చెప్పాలన్నారు.

minister talasani srinivas yadav comments on bandi sanjay
భాజపాకు ఓటు వేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే: మంత్రి తలసాని

By

Published : Nov 22, 2020, 8:46 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ను సవాల్​ చేసే స్థాయి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కి ఉందా అని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ప్రశ్నించారు. హైదరాబాద్​ బేగంబజార్​ డివిజన్​లో తెరాస అభ్యర్థి పూజ వ్యాస్​ తరఫున ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్​కు చెందిన పలువురు భాజపా, కాంగ్రెస్​ నాయకులు తెరాసలో చేరారు.

భాజపాకు ఓటు వేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని మంత్రి తలసాని ఆరోపించారు. భాజపా నాయకులు విద్వేషాలు రెచ్చగొట్టకుండా... హైదరాబాద్​ అభివృద్ధి కోసం ఏమి చేస్తారో చెప్పాలన్నారు.

ఇవీ చూడండి: మేయర్ పీఠమే లక్ష్యంగా తెరాస ప్రచార హోరు

ABOUT THE AUTHOR

...view details