తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS Dharna over Paddy procurement: 'ఇవాళ్టి ధర్నా ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది'

వరిధాన్యం కొనుగోలు విషయం(TRS Dharna over Paddy procurement)లో ముఖ్యమంత్రి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణులు ధర్నాకు దిగాయి. ఇందిరా పార్కు వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ధర్నా చేపట్టారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.

By

Published : Nov 12, 2021, 3:56 PM IST

TRS Dharna over Paddy procurement, trs strike news
తెరాస ధర్నా, తెలంగాణలో తెరాస ధర్నా

కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేలా చేయడం దుర్మార్గమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Talasani srinivas yadav news 2021) అన్నారు. ఆరు మాసాలుగా దిల్లీలో రైతులు పోరాటం చేస్తుంటే... కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కేంద్రం దగ్గరి నుంచి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి(kishan reddy news) లేఖ తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. తెరాస చేపట్టిన ఇవాళ్టి ధర్నా... ట్రైలర్‌ మాత్రమేనని అసలు సినిమా ముందుందని ఇందిరా పార్కు ధర్నా(TRS Dharna over Paddy procurement) చౌక్‌ వేదికగా హెచ్చరించారు.

హుజూరాబాద్‌లో(huzurabad by election victory) గెలవగానే భాజపా విర్రవీగుతోందని తలసాని ఆరోపించారు. ఒక ఉపఎన్నికకే ఇలా అయితే.. వరుస విజయాలు సాధిస్తున్న తాము ఎలా ఫీలవ్వాలని ప్రశ్నించారు. 2014కు ముందు ఎడారిలా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్‌(CM KCR news 2021) సస్యశ్యామలం చేశారని తెలిపారు. కేంద్రం తక్షణమే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని... లేనిపక్షంలో పార్లమెంట్‌ ఎలా నడుస్తుందో చూస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాకముందు తాగునీరు, కరెంటు ఉండేది కాదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ(mamahood ali news) అన్నారు. కాళేశ్వరం జలాల ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు అందిస్తున్నామన్నారు. కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌(TRS Dharna over Paddy procurement) చేశారు.

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ధ ధర్నా(TRS Dharna over Paddy procurement) చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్‌, అరికెపుడి గాంధీ, ముఠాగోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, దానం నాగేందర్‌, సుధీర్‌ రెడ్డి, సాయన్న, ఎమ్మెల్సీ సురభివాణిదేవీతో పాటు కార్పొరేషన్‌ ఛైర్మన్లు, కార్పొరేట్లర్లు పాల్గొన్నారు. కేంద్రం తక్షణమే వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

వరిధాన్యం కొనుగోలు విషయం(TRS Dharna over Paddy procurement)లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోటాపోటీ ధర్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే వరి కొనుగోలు చేయాలంటూ గురవారం భాజపా ఆందోళన చేపట్టగా.. నేడు అధికార పార్టీ రోడ్డెక్కింది. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గులాబీ దళం పోరుబాట పట్టింది. ముఖ్యమంత్రి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణులు ధర్నాకు దిగాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు... ఇతర నేతలతో కలిసి ధర్నా చేపట్టారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details