ఈ సంవత్సరం ఆషాడ బోనాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ.15కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.
Bonalu: జులై 11న గోల్కొండ, 25న లష్కర్ బోనాలు - బోనాల నిర్వహణపై తలసాని శ్రీనివాస్ యాదవ్
13:13 June 21
Bonalu: జులై 11న గోల్కొండ, 25న లష్కర్ బోనాలు
జులై 11 నుంచి బోనాలు
గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా బోనాలను నిర్వహించుకోలేకపోయామన్నారు. కానీ ఈ ఏడాది జులై 11వ తేదీన గోల్కొండ బోనాలు, 25వ తేదీన సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1వ తేదీన హైదరాబాద్ లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు ఉంటాయని మంత్రి వివరించారు. ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో అత్యున్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మలారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, సజ్జనార్, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని తలసాని వివరించారు.
ఇదీ చూడండి:వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలక మార్పులు