తెలంగాణ

telangana

ETV Bharat / state

'అత్యధికంగా కార్యకర్తలు తెరాసలోనే ఉన్నారు' - తలసాని శ్రీనివాస్​ యాదవ్​

ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీగా తెరాస అవతరించిందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. హైదరాబాద్​ ఉప్పల్​లో నిర్వహించిన తెరాస సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్​

By

Published : Jul 16, 2019, 11:36 AM IST

హైదరాబాద్‌లో పురపాలక ఎన్నికలు ఎప్పడైనా రావచ్చునని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఉప్పల్​లో నిర్వహించిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే భేతి సుభాష్​రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీగా తెరాస అవతరించిందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోన్న వ్యక్తి కేసీఆర్​ అని... రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తోన్న ఘనత ఆయనదేనని ప్రశంసించారు.

'అత్యధికంగా కార్యకర్తలు తెరాసలోనే ఉన్నారు'

ABOUT THE AUTHOR

...view details