'నాయకుల చుట్టూ ఫోటోల కోసం తిరగొద్దు'
నాంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లిలోని రెడ్‌హిల్స్‌లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని
పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లి నియోజక వర్గంలో ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్ స్థానాలు గెలిచేలా కృషి చేయాలని కోరారు. నాయకుల చుట్టూ ఫోటోల కోసం తిరగొద్దని... పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు మంత్రి సూచించారు.