సికింద్రాబాద్ ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. పేద ప్రజల ఆకలి తెలిసిన నాయకుడు కీసీఆర్ అని తలసాని అన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో రోడ్లపై ఉన్న చెత్తను, మురికిని, శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు గొప్పవని ఆయన తెలిపారు. కరోనా సమయం నుంచి అంచెలంచెలుగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి వేతనాలు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తుగా వేతనాల పెంపు: మంత్రి తలసాని - మంత్రి తలసాని సీఎంకు పాలాభిషేకం
పారిశుద్ధ్య కార్మికులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉందని పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. దీపావళి సందర్భంగా సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు సికింద్రాబాద్‌లో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో కలిసి పాలాభిషేకం నిర్వహించారు.
'పారిశుద్ధ్య కార్మికులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణానే'
అదేవిధంగా నగర ప్రజలకు 50 శాతం పన్ను రాయితీని కల్పించడం శుభపరిణామమని అన్నారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు వరద బాధితుల విషయంలో చిల్లరగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే 77 వేల కుటుంబాలకు వరద సాయం అందించామని ఆయన వెల్లడించారు. వరద సాయం అందని బాధితులు దగ్గరలోని మీసేవలో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి:ప్రజారోగ్యానికి 'పంచతత్వ'... హైదరాబాద్‌లో పార్కు ప్రారంభోత్సవం