హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ ప్రాంతంలో మట్టి గణపతి ప్రతిమలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎల్లవేళలా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతుందని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందరూ మట్టి గణపతి ప్రతిమలను పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, స్థానిక కార్పొరేటర్ సంగీత, తదితరులు పాల్గొన్నారు.
దయచేసి మట్టి గణేష్‌లను పూజించండి: మంత్రి తలసాని - నాగోల్ ప్రాంతం
వచ్చే తరానికి ఎంత ఆస్తి ఇస్తున్నామనేది కాదు.. ఒక ఆరోగ్యకపరమైన వాతావరణాన్ని ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొరారు.
దయచేసి మట్టి గణేష్‌లను పూజించండి: మంత్రి తలసాని