ప్రభుత్వాదేశాలకు అనుగుణంగా ఈనెల 12న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు భక్తులు లేకుండా జరపనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో జరపాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దంపతులు - Minister talasani latest news today
తెలంగాణలో ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ ఈనెల 12న నిరాడంబరంగా జరగనుంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులు, వీఐపీలకు అనుమతి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం తరపున ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దంపతులు
ప్రభుత్వం తరఫున అమ్మవారికి సమర్పించనున్న పట్టు వస్త్రాలను మహంకాళి ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, తలసాని దంపతులు ఆలయ పండితులకు అందజేశారు. ఈసారి భక్తులతోపాటు వీఐపీలకు కూడా దర్శనం లేదని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో కరోనా మహమ్మారి అంతరించి పోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదీ చూడండి :సీఐ ఇంట్లో రూ.3 కోట్ల ఆస్తులు.. కూపీ లాగుతున్న అనిశా