హైదరాబాద్ అమీర్‌పేటలో ముంపు బాధిత కుటుంబాలకు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్ధిక సాయం అందించారు. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి చేయూతను అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: తలసాని - hyderabad latest news
ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సాయాన్ని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధితులకు అందజేశారు. ప్రతి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తెలిపారు.
ముంపు బాధితులకు ఆర్థిక సాయం అందించిన మంత్రి
నలభై ఏళ్ల చరిత్రలో హైదరాబాద్‌లో కనివిని ఎరుగని వరద వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వరద సహాయక చర్యలను ఏ మాత్రం పట్టించుకోక పోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా విమర్శలు మానుకొని వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి :తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్