హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో అధికారులతో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రిటైల్ మద్యం దుకాణాల దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. రిటైల్ షాప్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు దరఖాస్తులు స్వీకరించే విధానంపై అధికారులతో చర్చించారు. టోల్ ఫ్రీ నెంబర్కు వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు అజయ్ రావు, హైదరాబాద్ ఉపకమిషనర్ వివేకానంద రెడ్డి, రంగారెడ్డి ఉప కమిషనర్ ఖురేషి, హరి కిషన్ పాల్గొన్నారు.
ఫిర్యాదులు తక్షమే పరిష్కరించాలి: శ్రీనివాస్ గౌడ్ - ఫిర్యాదులు తక్షమే పరిష్కరించాలి: శ్రీనివాస్ గౌడ్
టోల్ ఫ్రీ నెంబర్కు వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
శ్రీనివాస్ గౌడ్
Last Updated : Oct 10, 2019, 6:51 AM IST