తెలంగాణ పర్యటక ప్రాంతాల్లో టెలివిజన్ ధారావాహికలు చిత్రీకరించే దర్శక, నిర్మాతలకు ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్లు రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో పలువురు టీవీ దర్శక నిర్మాతలతో ప్రత్యేకంగా సమావేశమైన శ్రీనివాస్ గౌడ్... రాష్ట్రంలోని పర్యటక ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలను వివరించారు.
'ధారావాహికలకు పర్యటక ప్రాంతాలను ఉపయోగించండి'
ధారావాహికలు చిత్రీకరించే టెలివిజన్ నిర్వాహకులు... పర్యటక ప్రాంతాలను ఉపయోగించుకుంటే ప్రభుత్వం తరఫున ప్రత్యేక రాయితీలు ఇస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తద్వార పర్యటక ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
'ధారావాహికలకు పర్యాటక ప్రాంతాలను ఉపయోగించండి'
తెలంగాణలోని ప్రతి జిల్లా పర్యటక ప్రాంతంగా మారిందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ధారావాహికలు చిత్రీకరించే టెలివిజన్ నిర్వాహకులు... పర్యటక ప్రాంతాలను ఉపయోగించుకుంటే ప్రభుత్వం తరఫున ప్రత్యేక రాయితీలు ఇస్తామని వెల్లడించారు. తద్వార పర్యటక ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఇదీ చదవండి:'కొవాగ్జిన్' రెండోదశ ప్రయోగానికి ఏర్పాట్లు