రాష్ట్రంలో నూతన క్రీడా విధానం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - minister srinivas goud latest news
10:49 June 23
రాష్ట్రంలో నూతన క్రీడా విధానం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
రాష్ట్రంలో త్వరలోనే మంచి క్రీడా పాలసీని తయారు చేస్తామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తామని తెలిపారు. క్రీడాకారులు రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమన్నారు. మంత్రుల నివాస ప్రాంగణంలో అంతర్జాతీయ ఒలింపిక్స్ డే ఉత్సవాలను మంత్రి ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని క్రీడాకారులకు ఒలింపిక్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
క్రీడా పాలసీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘం వేశారని మంత్రి పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు మంచి క్రీడా పాలసీని తయారు చేస్తామని స్పష్టం చేశారు.