కాంగ్రెస్ నేతల ధర్నాలకు భయపడి కేసీఆర్ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గరని... సచివాలయం, అసెంబ్లీ నిర్మించి తీరుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు చేపడుతున్నారు తప్ప తన కోసం కాదన్నారు. ప్రతిపక్ష హోదా పోవడం వల్ల కాంగ్రెస్ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్ధాయి హస్తం నేతలకు లేదని.. సీఎంను ఎంత విమర్శిస్తే ప్రజల్లో అంత చులకల అవుతున్నారని ఆరోపించారు. కొత్త భవనాలు కట్టిన తర్వాత వారు కూడా కేసీఆర్ ను పొగడక తప్పదన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఎమ్మెల్యే సోదరుడైనప్పటికీ.. కాగజ్ నగర్ ఘటనలో ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
"కేసీఆర్ ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గరు" - SRINIVAS GOUD
కాంగ్రెస్ నేతలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల విషయంలో ముఖ్యమంత్రి ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గరని తెలిపారు. కేసీఆర్‌ను విమర్శంచే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదన్నారు.
కేసీఆర్ ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గరు
TAGGED:
SRINIVAS GOUD