Advanced International Cricket Stadium: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బలోపేతం చేయాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.హెచ్‌సీఏ విస్తరణకు తగిన కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో క్రీడాశాఖ ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయాతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను తక్షణమే ఏర్పాటు చేసి తద్వారా జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
త్వరలోనే హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. - Advanced International Cricket Stadium
Advanced International Cricket Stadium: భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఉప్పల్ స్టేడియం తరహాలో మరో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధంచేయాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. రాష్ట్రంలో క్రికెట్ మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో పాటు 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో క్రికెట్ క్లబ్‌ల ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రికెట్ క్లబ్‌లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మాదిరిగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో క్రికెట్ మరింత విస్తరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
ఇవీ చదవండి: