రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యపై గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ హరీశ్‌ను ఆదేశించారు. మహిళా అధికారులపై ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విజయారెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన మంత్రి... ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
నిందితుడిని ఉపేక్షించేది లేదు: సత్యవతి రాఠోడ్ - అబ్దుల్లాపూర్‌మెట్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సజీవ దహనంపై మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్‌ను ఆదేశించారు.
తహసీల్దార్ హత్యపై స్పందించిన మంత్రి సత్యవతి