తెలంగాణ

telangana

ETV Bharat / state

'సరైన ప్రోత్సాహం అందిస్తే ప్రపంచం గర్వించే విధంగా ఎదుగుతారు' - మంత్రి సత్యవతి రాఠోడ్​

మహిళలకు సరైన చేయూత అందిస్తే తమ సత్తాను నిరూపించుకుంటారని మంత్రి సత్యవతి రాఠోడ్​ తెలిపారు. వారికి సరైన ప్రోత్సాహం, ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల పారిశ్రామికవేత్తలుగా రాణించలేకపోతున్నారన్నారు. వి.హబ్ మహిళా పారిశ్రామికవేత్తల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మంత్రి శ్రీమతి సత్యవతి రాఠోడ్ తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో వి.హబ్ నిర్వాహకులను అభినందించారు.

minister satyavathi rathode spoke on women enterpreneurship
'సరైన ప్రోత్సాహం అందిస్తే ప్రపంచం గర్వించే విధంగా ఎదుగుతారు'

By

Published : Sep 26, 2020, 4:29 AM IST

మహిళలకు సరైన ప్రోత్సాహం, ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల పారిశ్రామికవేత్తలుగా రాణించలేకపోతున్నారని శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. వి.హబ్ మహిళా పారిశ్రామికవేత్తల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మంత్రి శ్రీమతి సత్యవతి రాఠోడ్ తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో వి.హబ్ నిర్వాహకులను అభినందించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సరైన చేయూత అందిస్తే ఎవరికీ తీసిపోని విధంగా, ప్రపంచం గర్వించే విధంగా ఎదుగుతారని మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో మహిళా సాధికారత, సంక్షేమ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో మహిళల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి వి.హబ్ చేస్తున్న కృషి అభినందించదగిందని, దేశవ్యాప్తంగా తెలంగాణ మహిళలకు గుర్తింపు తీసుకురావడం ప్రశంసనీయమన్నారు. తెలంగాణ మహిళలు కష్టపడి పనిచేసేవారని, అత్యంత నిజాయితీపరులని మంత్రి అన్నారు. తెలంగాణ మహిళలకు అవకాశం వస్తే కచ్చితంగా తమ సత్తాను నిరూపించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోనూ అత్యంత ప్రతిభావంతులైన మహిళలు ఉన్నారని, వీరిని గుర్తించి సరైన విధంగా ప్రోత్సహిస్తే రాష్ట్రం గర్వించే విధంగా ఎదుగుతారని తెలిపారు.ఇప్పటికే ట్రైకార్, సెర్ప్, మెప్మా, ఆస్ట్రేలియన్ కాన్సులేటుతో వి.హబ్ ఒప్పందాలు చేసుకుని వివిధ కార్యక్రమాలు చేపట్టడం వల్ల తెలంగాణ మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.

ఇవీ చూడండి: వందసార్లు రక్తదానం చేసిన విశాఖ వ్యక్తి

ABOUT THE AUTHOR

...view details