minister satyavathi comments on BJP: గిరిజనులకు ఆర్థిక, రాజకీయ అధికారాలు పెంపొందించేలా సీఎం కేసీఆర్ విధానాలున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించేందుకు శాసనసభ తీర్మానం చేస్తే కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదని ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దళిత, గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనడాన్ని మంత్రి సత్యవతి ఖండించారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి, రైతుబంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రవీంద్రనాయక్, హరిప్రియ నాయక్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
త్వరలోనే పరిష్కారం
గిరిజన, దళిత నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్న భాజపా.. ఏడేళ్లలో గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం చేసేందేమి లేదని మంత్రి సత్యవతి విమర్శించారు. పోడు చట్టం కేంద్రం పరిధిలో ఉంటుందని తెలుసుకోకుండా తామే ఉద్యమం చేస్తామని బండి సంజయ్ చెప్పడం సిగ్గు చేటని అభిప్రాయపడ్డారు. పోడు భూములపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని.. త్వరలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. విభజన చట్టంలో ఉన్న గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం ఎందుకు ముందుకు రావడంలేదని మంత్రి ప్రశ్నించారు. గిరిజనులు భాజపాను నమ్మే పరిస్థితిలేదని ఎద్దేవా చేశారు.
ఓటు బ్యాంకుగానే చూశాయి