తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లంలో బోధన: సబితా ఇంద్రారెడ్డి

Minister Sabitha indrareddy: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లంలో బోధన సాగుతుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో.. మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సహా ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి... అలియా, మహబూబియా పాఠశాలలను సందర్శించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లంలో బోధన: సబితా ఇంద్రారెడ్డి
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లంలో బోధన: సబితా ఇంద్రారెడ్డి

By

Published : May 27, 2022, 4:14 PM IST

Minister Sabitha indrareddy: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 7,300 కోట్ల రూపాయలతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల తీసుకొస్తున్నామన్నారు. మన బస్తీ - మన బడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బషీర్‌బాగ్‌ అలియా, మహబూబియా పాఠశాలల్లో జరుగుతున్న పనులను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పరిశీలించారు. పాఠశాలల్లో అభివృద్ధి చేస్తూ అన్ని సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని సభితా అన్నారు.

రంగులు వేయటమే కాదు భవనాలు, తాగునీరు, మరుగుదొడ్లు, డిజిటల్ తరగతుల ఏర్పాటు జరుగుతుందన్నారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నామని... నాడు నేడు పాఠశాలల పరిస్థితి ఏంటనేది ఒకసారి చూడాలన్నారు. 75 శాతం పనులు పూర్తయ్యాయని.. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. తల్లిదండ్రులందరూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని విజ్ఞప్తి చేశారు.

"కేవలం రంగులు వేయడమే కాదు.. ప్రైవేట్​ పాఠశాలల్లో ఉండే హంగులన్నీ ప్రభుత్వ బడుల్లో ఉండే విధంగా.. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు అభివృద్ధి చేస్తున్నాం. 12 విభాగాల్లో పాఠశాలలను అభివృద్ధి చేయాలని కేబినెట్​ సబ్​కమిటీలో చర్చించాం. విద్యార్థులు మళ్లీ పాఠశాలకు వచ్చే సమయానికి రూపురేఖలు మార్చాయాలనే సంకల్పంతో అభివృద్ధి పనులు చేపట్టాం. మంత్రులు, శాసనసభ్యులు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్​ మీడియం బోధించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్​ ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్​లోనే బోధన ఉంటుంది. పుస్తకాలను ముద్రించడం కూడా జరిగింది." -సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లంలో బోధన

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details