భాషోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
'భాషా పండితుల పదోన్నతికి ప్రభుత్వం సుముఖం' - language teachers latest updates
భాషోపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు భాషోపాధ్యాయ సంస్థ సభ్యులతో తన క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడారు.
శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో భాషోపాధ్యాయ సంస్థ సభ్యులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా 2021 డైరీని ఆమె ఆవిష్కరించారు. అప్గ్రేషన్ పరంగా ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా వారు చేసిన సూచనపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్, కార్యదర్శి గౌరీ శంకర రావు, రాష్ట్ర బాధ్యులు పెండ్యాల బ్రహ్మయ్య, షేక్ హాజీ నూరానీ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రామాలయానికి తొలి విరాళం అందించిన రాష్ట్రపతి