రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో 'పల్లె నిద్ర' కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మంగళవారం ఉదయం.. గ్రామంలోని మోడల్ స్కూల్‌ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, శౌచాలయాలు, మంచినీటి వ్యవస్థను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. వారికి మౌలిక సదుపాయాలను తక్షణమే అందజేస్తామని సబిత హామీ ఇచ్చారు.
నేదునూరు మోడల్ స్కూల్లో మంత్రి సబిత ఆకస్మిక తనిఖీ
'పల్లె నిద్ర' కార్యక్రమంలో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో పర్యటించారు. కందుకూరు మండలం నేదునూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, నేదునూరు, పల్లె నిద్ర
నేరుగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందని చిన్నారులను అడిగారు. పాఠశాల ఆవరణలో రూ. 20 లక్షలతో గ్రంథాలయం నిర్మించి పుస్తకాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:ఎండోస్కోపిక్ బేరియాట్రిక్: కోత లేకుండా మధుమేహానికి చికిత్స