కూకట్పల్లి డివిజన్లో యాభై ఏళ్లుగా జరగని అభివృద్ధి ఐదేళ్లలో చేశామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపామని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తెరాస అభ్యర్థులను గెలిపిస్తాయని మంత్రి తెలిపారు.
ఐదేళ్లలో యాభై ఏళ్ల అభివృద్ధి: పువ్వాడ అజయ్ - మంత్రి పువ్వాడ అజయ్
తెరాస ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో భాజపా నాయకులు పెద్దసంఖ్యలో తెరాసలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఐదేళ్లలో యాభై ఏళ్ల అభివృద్ధి : పువ్వాడ అజయ్
కూకట్పల్లి డివిజన్లోని భాజపా నాయకులను కండువా కప్పి పెద్దసంఖ్యలో పార్టీలోకి ఆహ్వానించారు. తెరాస అభ్యర్థి మందడి శ్రీనివాసరావును భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.