Minister Puvvada Ajay Kumar review: రవాణా శాఖలో అందిస్తున్న పౌర సేవలు, ఆన్లైన్ సేవలు.. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రవాణా శాఖలో ఆన్లైన్ సేవలను మరింత విస్తృతం చేయ్యాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
రవాణా శాఖలో మరికొన్ని సేవలను ఆన్లైన్ ద్వారా అందించేందుకు సాధ్యమయ్యే అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న బస్సులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఆర్టీసీ రోజువారి ఆదాయ, వ్యయాలపై అధికారులతోమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేకంగా చర్చించారు.