ఖమ్మం జిల్లాలో వ్యవసాయం మరింత మెరుగుపడేందుకు అధికారులు, నేతలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం టీటీడీసీ భవన్లో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలోనే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తామన్నారు. అధికారులందరూ రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్, రైతు సమన్వయ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
'త్వరలోనే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం'
వ్యవసాయ పథకాలన్నీ ప్రతీ రైతుకు అందేలా అధికారులు కృషి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ఖమ్మం టీటీడీసీ భవన్లో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
'త్వరలోనే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం'