తెలంగాణ

telangana

ETV Bharat / state

Perni Nani Meet Mohan Babu: మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్ని నాని - సినీ నటుడు మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్​ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని.. సినీ నటుడు మంచుమోహన్‌ బాబు, చలన చిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు విష్ణును కలిశారు. సినీ పరిశ్రమ సమస్యలపై.. సీఎంతో గురువారం జరిగిన భేటీపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

Perni Nani Meet Mohan Babu
మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్ని నాని

By

Published : Feb 11, 2022, 3:29 PM IST

Perni nani meets mohan babu: మంత్రి పేర్ని నాని.. సినీ నటుడు మోహన్‌బాబు, మంచు విష్ణును హైదరాబాద్‌లో కలిశారు. సినీ పరిశ్రమ సమస్యలపై చిరంజీవి బృందం సీఎంను కలిసిన మరుసటిరోజే పేర్నినాని... మోహన్‌బాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసానికి వెళ్లిన పేర్నినాని.. ముఖ్యమంత్రితో చిరంజీవి బృందం చర్చించిన అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..

Tollywood Celebrities Meet CM Jagan: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు గురువారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై జరిగిన ఈ చర్చలో.. పరిశ్రమ తరపున చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు పాల్గొన్నారు.

జగన్​ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి పేర్ని నానితోపాటు ఉన్నతాధికారులూ పాల్గొన్నారు. నిర్మాతలు నష్టపోకుండా టికెట్ల ధరలు పెంచాలని పరిశ్రమ ప్రముఖులు కోరారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా.. టికెట్ ధరలు పెంచాలని ప్రాథమికంగా సిఫార్సు చేసినట్లు తెలిసింది. పరిశ్రమ ప్రతిపాదనలు, కమిటీ సిఫార్సులపై సినీ ప్రముఖులతో సీఎం జగన్​ చర్చించారు. ఎంతమేర టికెట్లు పెంచాలనే దానిపై అభిప్రాయాలు తీసుకున్నారని తెలిసింది.

వివిధ అంశాలపై...

చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ సహకారంతోపాటు సినీ కార్మికులకు సాయంపైనా.. ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు చర్చించారని సమాచారం. కొవిడ్‌ తొలిదశలో లాక్​డౌన్ కారణంగా 3నెలలపాటు థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత తెరచుకున్నా.. 50 శాతం సీటింగ్ సహా వివిధ రకాల ఆంక్షలతో రాబడి అంతంతమాత్రమేనని యజమానులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో థియేటర్ల యజమానులకు కరెంట్ బిల్లుల రాయితీ సహా సినీ కార్మికులకు అందించాల్సిన సాయంపైనా చర్చించారని తెలిసింది. ఈ భేటీ నేపథ్యంలో.. సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇవ్వడం, ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలపైనా సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: Tollywood Celebrities Meet AP CM Jagan: సీఎం జగన్​తో ముగిసిన సినీ ప్రముఖుల భేటీ

ABOUT THE AUTHOR

...view details