తెలంగాణ

telangana

ETV Bharat / state

పామాయిల్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి నిరంజన్​రెడ్డి

రాష్ట్రంలో పామాయిల్‌ సాగును కేంద్ర నిపుణుల బృందం సందర్శించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శాసనసభలో తెలిపారు. తెలంగాణలోని 23 గ్రామీణ జిల్లాలు పామాయిల్ సాగుకు అనుకూలమని నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు.

Minister niranjan Reddy respond by oilseed farming
Minister niranjan Reddy respond by oilseed farming

By

Published : Mar 12, 2020, 12:31 PM IST

రాష్ట్రంలో దాదాపు 7.5 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయొచ్చని కేంద్ర నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ఇవాళ సభలో పామాయిల్‌ సాగుపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉందన్న మంత్రి... దేశంలో నూనెగింజల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

పాలమూరు జిల్లాలో మూతబడిన నూనెగింజల కర్మాగారాన్ని వన్ టైం సెటిల్‌మెంట్‌తో తిరిగి ప్రారంభించామని మంత్రి తెలిపారు. పామాయిల్ సాగులో చీడపురుగుల బెడద ఉండదని పేర్కొన్నారు. పామాయిల్ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని నిరంజన్​ రెడ్డి చెప్పారు.

'నూనెగింజల సాగును ప్రోత్సహించాల్సిన అవసరముంది'

ఇవీ చూడండి:అసెంబ్లీ వద్ద భద్రత కట్టుదిట్టం

ABOUT THE AUTHOR

...view details