రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్న దృష్ట్యా వరి కాకుండా... కంది, పత్తి, నూనెగింజల సాగు మేలని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఖరీఫ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పట్నుంచే రైతులను క్షేత్రస్థాయిలో చైతన్యపరచాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యతపై హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో తన నివాసం నుంచి అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో మంత్రి జూమ్ ద్వారా సమీక్షించారు.
డిమాండ్ ఉంది..
వ్యవసాయ అనుకూల విధానాలు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, సాగు నీటితో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోందని మంత్రి ప్రస్తావించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా నూనెగింజలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున విత్తన కంపెనీలు.. నూనెగింజల విత్తనాలను విస్తృతంగా రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయాలను బలంగా రైతుల్లోకి తీసుకువెళ్లడంతోపాటు రాబోయే రెండు నెలలు సమయస్ఫూర్తితో పని చేయాలని సూచించారు.
నిర్ణీత సమయానికి..