హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌లో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. ఆహార భద్రత- శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ధృవీకరణ బ్రోచర్‌ను మంత్రి విడుదల చేశారు. కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను మంత్రి అభినందించారు.
ఆహార భద్రత- శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి - Minister niranjan reddy latest updates
హైదరాబాద్‌లో ఆహార భద్రత- శిక్షణా కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు.
మంత్రి నిరంజన్ రెడ్డి
ఈ కార్యక్రమంలో ఫాస్టాక్ నిర్వాహకులు సయ్యద్ హుస్సేన్, సయ్యద్ జహంగీర్, అనిల్ గౌడ్, అజీజ్ ఖాన్, ప్రైవేటు ఉద్యోగసంఘాల నాయకుడు గంధం రాములు తదితరులు పాల్గొన్నారు.