మార్కెట్ల వద్ద రద్దీ తగ్గించేందుకే సంచార రైతుబజార్లను ఏర్పాటు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. జంట నగరాల్లో 63 మొబైల్ వాహనాలతో 109 ప్రాంతాలకు కూరగాయల అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. లాంఛనంగా కొన్ని వాహనాలను మంత్రి ప్రారంభించారు.
'మార్కెట్లలో రద్దీ తగ్గించేందుకే సంచార రైతుబజార్ వాహనాలు'
మార్కెట్ల వద్ద రద్దీ తగ్గించేందుకే సంచార రైతుబజార్ వాహనాలు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో సంచార రైతు బజార్ వాహనాలను లాంఛనంగా మంత్రి ప్రారంభించారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నిత్యావసరాలను ఎక్కడైనా అధిక ధరలకు అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిత్యావసరాల సరఫరాకు ప్రభుత్వం వెసులుబాట్లు కల్పించినందున ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలిగినా అధికారుల దృష్టికి తీసుకురావాలని వివరించారు. బోయిన్‌పల్లి, ఎల్బీ నగర్ కూరగాయల మార్కెట్లు యధావిధిగా నడుస్తాయని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇవీచూడండి:'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'