రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పంట సాగుకు మంచి భవిష్యత్ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై టీ-శాట్ ద్వారా 'మన టీవీ' నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్లొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ పంట సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. టన్ను ఆయిల్‌పామ్ గెలలకు రూ.19 వేలు ధర పలుకుతుండటంతో ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుందని వివరించారు. ఎకరాకు రూ.36 వేల రాయితీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నువ్వులు, కుసుమ, వేరు శనగ తదితర నూనె గింజల సాగు ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశ అవసరాల కోసం ఏటా 70 వేల కోట్ల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నందున.. స్వయం సమృద్ధి సాధించాలంటే 80 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టాల్సి ఉంది. కానీ 8 లక్షల ఎకరాలే సాగవుతుందని ప్రస్తావన వచ్చింది. ఇది దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు చేయాలని నిర్ణయించాం. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి