Minister Malla Reddy Huge Rally in Malkajgiri: కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి(Marri Rajasekhar Reddy)కి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయన ప్రచారం ప్రారంభించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి, త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు. మైనంపల్లి రాజీనామాతో పలువురు అభ్యర్థులను పరిశీలన చేసిన పార్టీ అధినేత కేసీఆర్.. మర్రి రాజశేఖర్‌రెడ్డికి స్పష్టమైన సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది.
Malkajgiri BRS MLA Candidate : మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆ నియోజక వర్గంలో పరిస్థితులపై అవగాహన ఎన్నికల్లో ఉపయోగపడుతుందనే ఉద్ధేశంతో ఆ అభ్యర్థికి టికెట్ ఇచ్చేందుకు సుముఖత చూపిందని పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు రాజశేఖర్‌రెడ్డికి ఎన్నికల్లో ఉపయోగపడతాయని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.
BRS MLA Candidates List 2023 : కొలిక్కివచ్చిన BRS MLA జాబితా.. మిగిలిన 4 స్థానాల్లో ఎవరో తెలుసా?
Marri Rajasekhar Reddy BRS Candidate in Malkajgiri: అధిష్ఠానం సూచనతో ప్రచారం ప్రారంభించిన రాజశేఖర్‌రెడ్డి.. నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తన మామ మంత్రి మల్లారెడ్డితో కలిసి వచ్చిన ఆయనకు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. హైదరాబాద్‌లోని ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. డబ్బు కట్టలతో వస్తున్న కాంగ్రెస్ నేతల(Congress Leaders)ను నమ్మి మోసపోవద్దని మల్లారెడ్డి సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు సిన్మా చూపిస్తామని ఈ మామాఅల్లుళ్లు సవాల్ విసిరారు.