తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి దిశగా కేసీఆర్​ కృషి చేస్తున్నారు :మల్లారెడ్డి - మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్ ఎల్బీనగర్​లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్​రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, నగర మేయర్ బొంతు రామ్మోహన్​ పాల్గొన్నారు. కేసీఆర్​ నాయకత్వంలో తెలంగాణ దేశంలో అగ్ర స్థానానికి చేరుతోందని మంత్రి అన్నారు.

అభివృద్ధి దిశగా కేసీఆర్​ కృషి చేస్తున్నారు :మల్లారెడ్డి

By

Published : Sep 1, 2019, 3:48 AM IST

Updated : Sep 1, 2019, 9:15 AM IST

హైదరాబాద్ ఎల్బీనగర్​ పరిధిలో రూ. 9కోట్ల 17లక్షలతో పూర్తి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేవంత్​రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నాగోల్ డివిజన్ పరిధిలోని ఫతుల్లాగూడలో 5కోట్ల 50లక్షలతో నిర్మించిన జంతు సంరక్షణ కేంద్రంను, లలితనగర్​లో 8లక్షలతో నిర్మించిన మోడల్ మార్కెట్, అయ్యప్ప కాలనీలో కోటి 96లక్షలతో అలాగే చింతలకుంట కూడలిలో 25 లక్షలతో నిర్మించిన ఐస్లాండ్ పార్క్​ను మంత్రి ప్రారంభించారు. ఎల్బీనగర్​ రామోజీ ఫిల్మ్​సిటీ వెళ్లే మార్గంలో చిత్రసీమను సూచిస్తూ ఉన్న ప్రతిమ అందర్ని ఆకట్టుకుంటోంది. బంగారు తెలంగాణ దిశగా కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని మంత్రి అన్నారు.

అభివృద్ధి దిశగా కేసీఆర్​ కృషి చేస్తున్నారు :మల్లారెడ్డి
Last Updated : Sep 1, 2019, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details