రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి మంత్రి మల్లారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. సునీత అనే మహిళ కార్యాలయానికి వెళ్తుండగా బాలానగర్ వద్ద ద్విచక్రవాహనం పై నుంచి కింద పడింది. అటుగా వెళ్తున్న మంత్రి మల్లారెడ్డి తక్షణమే స్పందించి తన వాహనంలో ఆ మహిళను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
మానవత్వం చాటుకున్న మంత్రి... మహిళను కాపాడారు! - హైదరాబాద్ జిల్లా వార్తలు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి మల్లారెడ్డి. ద్విచక్రవాహనం పైనుంచి కిందపడిన మహిళను చూసిన మంత్రి వెంటనే కారు దిగారు. మంత్రి తీరుని స్థానికులు ప్రశంసిస్తున్నారు.
మానవత్వం చాటుకున్న మంత్రి... మహిళను కాపాడారు!
ఆ మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స అనంతరం ఆమెను ఇంటికి తరలించారు. మంత్రి స్పందించిన తీరుని స్థానికులు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి:ఖమ్మం జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ...