తెలంగాణ

telangana

ETV Bharat / state

Mallareddy On Mayday: అట్లుంటది.. మంత్రి మల్లారెడ్డితోని! - రవీంద్రభారతిలో మల్లారెడ్డి

Mallareddy On Mayday: మంత్రి మల్లారెడ్డి అంటే ఆ జోషే వేరు! ఆయన ఏ కార్యక్రమానికి వెళ్లిన తన మాటలతో హుషారెత్తిస్తారు. ఇలానే హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక దినోత్సవంలోనూ తన ప్రసంగంతో ఉర్రూతలూగించారు. కార్మికులకు తెలంగాణ ఓ అవకాశాల గని లాంటిందని.. సద్వినియోగం చేసుకోవాలని స్ఫూర్తి నింపారు. సాధారణ వ్యక్తి నుంచి కార్మికమంత్రి స్థాయికి తాను ఎలా ఎదిగానని విషయాన్ని వివరిస్తూ తనదైన శైలిలో నవ్వులు పూయించారు.

Mallareddy On may day
హైదరాబాద్ రవీంద్రభారతిలో మంత్రి మల్లారెడ్డి

By

Published : May 1, 2022, 9:57 PM IST

మల్లా రెడ్డా మజాకా.. అట్లుంటది మనతోని..!

Mallareddy On Mayday: సీఎం కేసీఆర్‌ కార్మికుల పక్షపాతి అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని వెల్లడించారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు తరిమి కొట్టాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక దినోత్సవంలోనూ తన ప్రసంగంతో సందడి చేశారు. దివాళా తీసిన కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీ వచ్చి ఏం చేస్తారని మంత్రి ప్రశ్నించారు.

కార్మికులను కూడా ధనవంతులను చేస్తాం. తెలంగాణ అంటే బంగారు కొండ. బంగారు గుట్ట. ఎంత కావాలంటే అంత తవ్వుకోవచ్చు. గతంలో ఎప్పుడు ధర్నాలే. ఇప్పుడు ఎక్కడన్నా గొడవలు జరుగుతున్నాయా? కార్మికులు అంటే ఎవరు.. ఫ్యాక్టరీ ఓనర్లు. నేను సైకిల్ మీద పాల క్యాన్లు తీసుకెళ్లా. నాకు పిల్లనిచ్చేదానికి ఎవరు ముందుకు రాలే. ఇప్పుడు పదివేల మంది టీచర్స్ నా దగ్గర పని చేస్తున్నారు. పాలు, పూలు అమ్మి వ్యవసాయం చేసినా. నాకు డెబ్భై ఏళ్లు ఇప్పుడు అయినా ఎంత స్మార్ట్​గా ఉన్నా. జై కార్మిక.

-మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి

తెలంగాణ ఏర్పడ్డాక ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయా అని కార్మికులను అడిగారు. కార్మికులంటే ఫ్యాక్టరీ యజమానులని కొనియాడారు. కార్మికుల ఓట్లను అందరూ దండుకున్నారని కానీ కార్మికులను ఎవరూ పట్టించుకోలేదని మంత్రి తెలిపారు. ప్రమాద బీమా అందరికి వర్తించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. కార్మికుల న్యాయమైన విజ్ఞప్తులను ప్రభుత్వానికి అందజేస్తానని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:నేనూ కార్మికుడినే.. కష్టమొస్తే మీ వెనకే ఉంటా: చిరంజీవి

చేనేతపై పన్నువేసిన పాపం భాజపాదే: కేటీఆర్‌

షవర్మా తిని విద్యార్థిని మృతి.. ఆస్పత్రిలో మరో 18 మంది

ABOUT THE AUTHOR

...view details